కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం : తిరుమలరావు

Dec 1,2023 08:52 #movie

‘ఈ మధ్యకాలంలో చిన్నారుల నుంచి ఇంటికి పెద్ద దిక్కు వరకు..అన్ని వయస్సుల వారు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘పల్లెగూటికి పండగొచ్చింది’. శ్రీకాకుళం జిల్లా ప్రాముఖ్యతను చాటిచెబుతుంది. ఆ జిల్లాలోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. సత్యవరం అనే గ్రామంలో బాధ్యతారాహిత్యంగా తిరిగే యువత…ఆ తర్వాత బాధ్యతను తెలుసుకుని ఆ గ్రామాన్ని స్మార్ట్‌ విలేజ్‌గా ఎలా మార్చారు’ అనే కథాంశంతో ఈ సినిమాను తీశాం’ అని దర్శకులు తిరుమలరావు కంచరాన పేర్కొన్నారు. .ప్రవీణ్‌ సమర్పణలో ఈశ్వర్‌ మెమోరియల్‌ లక్ష్మి ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కంచరాన రాజ్యలక్ష్మి నిర్మించిన చిత్రం ఇది. శుక్రవారంనాడు ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు తిరుమలరావు సినిమా వివరాలు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా పేర్కొన్నారు.

➡️