నా కుమార్తె చర్మ సంబంధిత సమస్యతో మృతి చెందింది : సుహానీ తల్లి

Feb 19,2024 17:55 #dangal, #movie

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ చిత్రంలో జూనియర్‌ బబితాకుమారి పాత్రను బాలనటి సుహానీ భట్నాగర్‌ నటించింది. సుహానీ ఇటీవల 19 ఏళ్లకే మృతి చెందింది. సుహానీ మృతిపై ఆమె తల్లి పూజా భట్నాగర్‌ మాట్లాడుతూ.. ‘సుహానీ చర్మ సంబంధిత వ్యాధితో మృతి చెందింది. సుహానీ యొక్క చర్మ సమస్యను మొదట మేము సాధారణ సమస్యగానే భావించాం. ఆ తర్వాత చర్మ సంబంధిత నిపుణులను సంప్రదించాం. చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరిపించిన తర్వాతే మాకు ఆమె పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లుగా అర్థం అయింది. డెర్మటోమయో సైటిస్‌ అనే వ్యాధిగా ఎయిమ్స్‌ వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి ముదిరి ఇన్ఫెక్షన్‌ బారినపడింది. దాంతో సుహానీ శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది పడింది. దంగల్‌ సినిమాలో నటించి ఆమె తల్లిదండ్రులుగా మాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. జీవితంలో ఎన్నో సాధించాలని ఆశపడింది. కానీ ఇంత త్వరగా జీవితాన్ని చాలిస్తుందని అనుకోలేదు.’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

➡️