కొత్త సినిమా పోస్టర్‌ విడుదల

May 22,2024 19:15 #movie, #Poster release

పేపర్‌ బాయ్ ఫేం డైరెక్టర్‌ జయశంకర్‌ ‘అరి’ అనే మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో సూర్య పురిమెట్ల ఓ ప్రధాన పాత్ర పోషించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందే.. సూర్య పురిమెట్ల మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. ఈ చిత్రానికి జయశంకర్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సుందర్‌ పాలుట్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వినయ్, నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, పవన్‌ తదితరులు పాల్గన్నారు.

➡️