ఆల్‌ ఇండియా ఓపెన్‌ బ్రిడ్జ్‌ టోర్నీని ప్రారంభించిన నిఖిల్‌

Mar 10,2024 17:18 #movies, #nikhil

ఎఫ్‌ఎన్‌సిసి నిర్వహించే 12 ఆల్‌ ఇండియా ఓపెన్‌ బ్రిడ్జ్‌ టోర్నమెంట్‌ను హీరో నిఖిల్‌ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 69 టీములు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా చైనాలో జరిగిన టోర్నమెంట్స్‌ లో సిల్వర్‌ మెడల్స్‌ గెలిచిన పలువురిని ఎఫ్‌ ఎన్‌ సి సి ఘనంగా సత్కరించింది. హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. ”ముందుగా నన్ను ఈవెంట్‌కి పిలిచినందుకు ముళ్లపూడి మోహన్‌ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక యాక్టర్‌ని కానీ ఇలా ఈవెంట్‌కి వచ్చి స్పోర్ట్స్‌ మెన్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మాలాంటి యాక్టర్స్ని ఇలాంటి ఫంక్షన్స్‌ కి పిలిచి స్పోర్ట్స్‌ మెన్స్‌ తో కలిపి మాకు కూడా ఒక మైండ్‌ రిఫ్రిషింగ్‌ ఈవెంట్‌ లాగా చేయడం చాలా ఆనందంగా ఉంది. స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌ లో ఇంటర్నేషనల్‌ వరకు వెళ్లి ఇండియా కోసం గోల్డ్‌ సిల్వర్‌ మెడల్స్‌ గెలిచిన ఆటగాళ్లని కలవడం వాళ్ళని సత్కరించడం ఆనందం గా ఉంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి టోర్నమెంట్‌ ద్వారా ఆడుతున్న టీమ్స్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌. ఇప్పుడున్న యువత ఈ బ్రిడ్జ్‌ టోర్నమెంట్‌ గురించి తెలుసుకోవాలి. దీని ద్వారా ఇంకా ఎక్కువ మంది యువకులు ముందుకొచ్చి పార్టిసిపేట్‌ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ ఎన్‌ సి సి వైస్‌ ప్రెసిడెంట్‌ తుమ్మల రంగారావు , సెక్రటరీ ముళ్ళపూడి మోహన్‌, జాయింట్‌ సెక్రెటరీ వి ఎస్‌ ఎస్‌ పెద్దిరాజు, ఏడిద సతీష్‌ (రాజా), ఫార్మర్‌ క్రికెటర్‌, ముంబై మాస్టర్స్‌, ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ ఫ్రాంచెస్‌ కో ఓనర్‌ చాముండేశ్వరనాథ్‌ పాల్గొన్నారు.

➡️