Thailand షూటింగ్‌కు ఎన్టీఆర్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కీలక షెడ్యూల్‌ను గోవాలో పూర్తి చేసుకుని ఇటీవల ఆయనతోపాటు ఆ చిత్ర బృందం హైదరాబాద్‌ చేరుకుంది. తాజా షెడ్యూల్‌ కోసం థాయ్ లాండ్‌ సోమవారం పయనమయ్యారు. అక్కడ ఓ పాట, కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేయనున్నారు. ఎన్‌టిఆర్‌తోపాటు సతీమణి లక్ష్మీ ప్రణతి, పిల్లలు కూడా వెళ్లారు. ఆదివారం సాయంత్రం కథానాయిక జాన్వీకపూర్‌ కూడా థారుల్యాండ్‌కు బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు ఆ వీడియోలను షేర్‌ చేస్తున్నారు. అయితే షుటింగ్‌తోపాటు తన కుటుంబంతో సరదాగా గడపడానికి కూడా ట్రిప్‌ వేసినట్లు తెలుస్తోంది.

➡️