‘ఓ- మై -బేబీ…’ పాట విడుదల

Dec 13,2023 19:15 #mahesh babu, #movie

మహేష్‌ బాబు ప్రధాన పాత్రలో, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుండి తాజాగా ఓ- మై- బేబీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం రిలీజ్‌ కి డేట్‌ దగ్గర పడుతుండటంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్‌పై ఎస్‌ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

➡️