‘ఓం భీమ్‌ బుష్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల

Mar 16,2024 20:38 #movie, #released, #triler

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. వి సెల్యూలాయిడ్‌, సునీల్‌ బలుసు కలిసి ఈ సినిమాను నిర్మించారు. యువి క్రియేషన్స్‌ సమర్పణలో ఈ నెల 22న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. శనివారం నాడు థియేట్రికల్‌ ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు. ప్రీతి ముకుందన్‌, ఆయేషాఖాన్‌ హీరోయిన్లుగా, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఆదిత్య మీనన్‌, రచ్చ రవి తదితరులు నటిస్తున్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా ఆడిన థియేటర్లు ప్రేక్షకుల నవ్వులతో మార్మోగుతాయని అన్నారు.

➡️