ఆగస్టు 15న ’35-చిన్న కథ కాదు’ విడుదల

Jun 25,2024 19:20 #movie, #niveditha thamas

సురేష్‌ ప్రొడక్షన్స్‌ కొత్త చిత్రం ’35-చిన్న కథ కాదు’. సురేష్‌ ప్రొడక్షన్స్‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌, వాల్టెయిర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. నివేతా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్‌ ఈమని రైటర్‌, డైరెక్టర్‌. ఈ మూవీకి ’35 – చిన్న కథ కాదు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ పెట్టారు. సినిమా పోస్టర్‌ ద్వారా టైటిల్‌ని మేకర్స్‌ విడుదల చేశఙారు. గుడి మెట్లపై కూర్చున్న ఫ్యామిలీని ప్రజెంట్‌ చేస్తూ క్యారికేచర్‌గా దీన్ని రూపొందించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న విడుదల చేయనున్నట్లుగా మేకర్లు తెలిపారు. వివేక్‌ సాగర్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందించారు. నికేత్‌ బొమ్మి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా లతా నాయుడు వ్యవహరిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్‌. నటీనటులు : నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌

➡️