ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా

Apr 12,2024 19:05 #movie, #pradeep ranganadhan

‘లవ్‌టుడే’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ప్రదీప్‌ రంగనాథన్‌ మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా తన కాలేజ్‌మేట్‌ అశ్వంత్‌ మారిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అశ్వంత్‌ గతంలో కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైయిన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

➡️