రకుల్‌-భగ్నానీల నూతన జంటకు ప్రధాని మోడీ స్పెషల్‌ విషెస్‌

Feb 23,2024 13:08 #modi, #rakhul, #Wishes

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జాకీ భగ్నానీల వివాహం ఫిబ్రవరి 21వ తేదీన గోవాలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఈ జాబితాలోకి ప్రధాని నరేంద్ర మోడీ కూడా చేరారు. తాజాగా ఈ జంటకు ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్‌ విషెస్‌ తెలిపారు. తనకున్న బిజీ షెడ్యూల్‌ కారణంగా వివాహానికి హాజరుకాలేకపోయానని.. పెళ్లికి ఆహ్వానం పంపింనందుకు ధన్యవాదాలు తెలుపుతూ మోడీ లేఖ ద్వారా ఈ జంటకు స్పెషల్‌ విషెస్‌ తెలిపారు. ఈ లెటర్‌ని రకుల్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసింది. ‘మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు, మా హృదయాలను తాకాయి. ఇవి మాకెంతో విలువైనవి… ధన్యవాదాలు’ అంటూ రకుల్‌, జాకీ ఇద్దరూ మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఇది వైరల్‌గా మారింది.

కాగా, ధనికవర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్‌ పెళ్లిళ్లు చేసుకోవాలని, తద్వారా పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న ప్రధాని మోడీ విజ్ఞప్తి మేరకు విదేశాల్లో చేసుకోవాలనుకున్న వీరి పెళ్లి ప్లాన్‌ను గోవాకు మార్చుకున్నారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

➡️