రేపు ‘రాజు యాదవ్‌’ విడుదల

May 23,2024 19:30 #getap srinu, #movie

బుల్లి తెర కమల్‌ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్‌ ఫేమ్‌ గెటప్‌ శ్రీను ‘రాజు యాదవ్‌’తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఫీల్‌ మై స్మైల్‌ అంటూ సాగే పాటను డైరెక్టర్‌ కొరటాల శివ విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్‌, చరిష్మా డ్రీమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లపై కె.ప్రశాంత్‌ రెడ్డి, రాజేష్‌ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. శుక్రవారం నాడు ఈ సినిమా విడుదల కానుంది.

➡️