రకుల్‌ బ్యాచిలర్‌ పార్టీ

Feb 6,2024 07:50 #New Movies Updates, #rakul

రకుల్‌ప్రీత్‌సింగ్‌, బాలీ వుడ్‌ నిర్మాత జాకీ భగ్నాని వివాహం త్వరలో జరగనుంది. గోవాలో ఈనెల 22న ఈ జంట వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం థారులాండ్‌లో బ్యాచిలర్‌ పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ పార్టీలో మంచు లక్ష్మితోపాటు హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్‌, సీరత్‌ కపూర్‌ కూడా కనిపించారు. రకుల్‌కు వీరు ముగ్గురూ చాలాకాలం నుంచి స్నేహితులుగా ఉంటున్నారు. త్వరలో పెళ్లి జరగనుండటంతో రకుల్‌ వీరికి బ్యాచిలర్‌ పార్టీని ఇచ్చారని సమాచారం.

➡️