‘రవన్న దావత్‌ ఇస్తుండు’

Apr 9,2024 19:08 #New Movies Updates, #raviteja

హీరో రవితేజ మరో సినిమాలో నటించబోతున్నారు. చిత్రబృందం ఆర్‌టి75 పేరుతో ఉగాది రోజున పోస్టర్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రానుంది. రైటర్‌ భాను బొగ్గవరపు ఈ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. భారీస్థాయిలో నిర్వహించబడుతున్న ఊరి జాతరను చూపిస్తూ, సృజనాత్మకంగా రూపొందించిన పోస్టరు ఆకట్టుకుంటోంది. పోస్టర్‌ మీద ‘రవన్న దావత్‌ ఇస్తుండు. రెడీ అయిపోండ్రీ’, ‘హ్యాపీ ఉగాది రా భరు’ అని తెలంగాణా యాసలో రాసివుంది. దీనిని బట్టి చూస్తే తెలంగాణా నేపధ్యంలో సాగే చిత్రమని అర్థమవుతుంది. ఈ సినిమాలో రవితేజ పాత్రపేరు ‘లక్ష్మణభేరి’ అని మేకర్స్‌ తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

➡️