‘రవికుల రఘురామ’ ట్రైలర్‌ విడుదల

Mar 14,2024 19:44 #New Movies Updates, #released, #triler

పాజిటివ్‌ వైబ్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ తెరకెక్కుతున్న లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ చిత్రం ‘రవికుల రఘురామ’. శ్రీధర్‌ వర్మ సాగి నిర్మాణంలో.. చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. గౌతమ్‌ సాగి, దీప్శిక జంటగా నటిస్తున్నారు. సుకుమార్‌ పమ్మి సంగీత దర్శకుడిగా పనిచేశారు. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్‌ విడుదలైంది. విజయ్ సేతుపతి ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మార్చి 15న ఈ చిత్రం విడుదలవ్వబోతోంది.

➡️