నిజమైన సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి : జ్యోతిక

Dec 22,2023 08:36 #jyothika, #movie

‘నేను చాలామంది దక్షిణాదికి చెందిన సూపర్‌స్టార్స్‌తో కలిసి నటించాను. కానీ, నిజమైన సూపర్‌స్టార్‌ మమ్ముట్టినే’ అని హీరోయిన్‌ జ్యోతిక తెలిపారు. నవంబర్‌ 23న విడుదలైన కాథల్‌-ది కోర్‌ పలువురి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. జీయోబాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరుపై చూపించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జ్యోతిక మమ్ముట్టితో కలిసి నటించటం ద్వారా వచ్చిన అనుభూతి గురించి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. ‘ఇలాంటి వైవిధ్యమైన పాత్రను ఎందుకు ఎంచుకున్నారని నేను సెట్లో అడిగాను. ఆయన ఇలా సమాధానం చెప్పారు. ‘అసలు హీరో అంటే విలన్లను కొట్టడం, యాక్షన్‌, రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం మాత్రమే కాదు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవాలి. ఎలాంటి పాత్రల్లోనైనా నటించగలగాలి’ అని వివరించారు.

➡️