3న శబరి విడుదల

Apr 12,2024 19:30 #movie, #varalakshmi sarath kumar

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహామూవీస్‌ పతాకంపై మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. అనిల్‌ కాట్జ్‌ దర్శకుడు. మే 3న ఈ సినిమా విడుదల కానుంది. శుక్రవారం నాడు ఐదుభాషల్లో ట్రైలర్‌ విడుదల చేశారు. హీరో వరుణ్‌సందేశ్‌ ముఖ్యఅతిథిగా హాజరై తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళ ట్రైలర్‌ను నిర్మాత మహేంద్రనాథ్‌ విడుదల చేశారు. వరలక్ష్మీశరత్‌కుమార్‌ మాట్లాడారు. ‘తెలుగులో ఫస్ట్‌టైమ్‌ ఫిమేల్‌ ఒరియెంటెడ్‌ సినిమా చేశా. నా క్యారెక్టర్‌ చుట్టూ నడిచే సినిమా ఇది. చాలా అద్భుతంగా తెరకెక్కింది. ఇప్పుడు ప్రేక్షకులు మంచి టాక్‌ వస్తే సినిమాలు చూస్తున్నారు. గుడ్‌ కంటెంట్‌ ఉంటే చూస్తున్నారు. ‘శబరి’గా నా పాత్ర చాలా థ్రిల్లింగ్‌ ఎక్సపీరియన్స్‌. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో నటుడు ఫణి, సినిమాటోగ్రాఫర్‌ నాని చమిడిశెట్టి, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆశిష్‌తేజ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మానస నున్న, కొరియోగ్రాఫర్‌ రాజ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️