‘సైంధవ్‌’ ట్రైలర్‌ : వెంకీ యాక్షన్‌ మామూలుగా లేదుగా..!

 

హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు దగ్గుబాటు వెంకటేష్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘సైంధవ్‌’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. వెంకటేష్‌ నటించిన 75వ చిత్రం ‘సైంధవ్‌’ కావడం విశేషం. దర్శకుడు శైలేశ్‌ కొలను తెరకెక్కించిన ఈ మూవీ.. కథేంటో ట్రైలర్‌లోనే తెలిసిపోయింది. ఇక ట్రైలర్‌లో హీరో హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతుంటాడు. సడెన్‌గా తన కూతురు ‘స్పెనల్‌ మాస్క్యూలర్‌ ఎట్రోఫి’ అనే అరుదైన వ్యాధికి గురవుతుంది. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే రూ. 17 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ పాపకివ్వాలి అని వైద్యులు చెబుతారు. తన పాపకివ్వాల్సిన ఖరీదైన ఇంజెక్షన్‌ కోసం హీరో విలన్‌తో తలపడతాడు. పెళ్లికి ముందుహీరో గతమేంటి? హీరోకి, విలన్‌కి మధ్య ఉన్న గొడవలేంటి? చివరకి తన కూతురి ప్రాణాల్ని హీరో రక్షించుకున్నాడా లేదా? వంటి విషయాలపై ఆసక్తి పెంచేలా ట్రైలర్‌ ఉంది. అయితే ఈ ట్రైలర్‌లో యాక్షన్‌ సీన్స్‌ ఎవరూ ఊహించనివిధంగా ఉన్నాయి. ఇలాంటి సీన్స్‌లో వెంకటేష్‌ నటన మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా ఉంది.

➡️