‘సలార్‌’ ట్రైలర్‌ రిలీజ్‌

Dec 18,2023 16:21 #New Movies Updates

ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాన్‌ ఇండియా చిత్రంప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్‌: సీజ్‌ ఫైర్‌ రిలీజ్‌ ట్రైలర్‌ వచ్చేసింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, శృతి హాసన్‌ జంటగా సలార్‌: సీజ్‌ ఫైర్‌ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 22న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘ఖాన్సార్‌’ అనే కాల్పనిక నగరం నేపథ్యంలో సలార్‌ మొదటి పార్ట్‌ ఉంటుంది. ఇప్పటికే సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న సలార్‌ మొదటి పార్టుకు A సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇందులో పథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, టినూ ఆనంద్‌, ఈశ్వరీరావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్‌ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్‌ సంగీతం అందించారు.

➡️