‘సీతా కళ్యాణ వైభోగమే’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Apr 6,2024 19:20 #movie, #suman tej

సుమన్‌తేజ్‌, గరీమచౌహన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. డ్రీమ్‌గేట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సతీష్‌ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్స్‌ ఎపిసోడ్స్‌తోపాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రం రాబోతుందని మేకర్స్‌ ఇటీవల ప్రకటించారు. గోవాలో కొరియోగ్రాఫర్‌ భానుమాస్టర్‌ నేతృత్వంలో దాదాపు 250 మంది డ్యాన్సర్లతో ఈచిత్రంలోని ఓ పాటను చిత్రీకరించారు. ఫస్ట్‌లుక్‌ను శనివారంనాడు మేకర్స్‌ విడుదల చేశారు. గగన్‌విహారి విలన్‌గా నటిస్తున్నారు. నాగినీడు, శివాజీరాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌, కెమెరామెన్‌ పరశురామ్‌, ఎడిటర్‌ డి.వెంకట్‌ప్రభు, ఫైట్‌మాస్టర్‌ డ్రాగన్‌ ప్రకాష్‌, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్‌, పోలంకి విజయ్ పనిచేస్తున్నారు.

➡️