స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ”సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటిస్తోంది. ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. గత నవంబర్, డిసెంబర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుందీ సినిమా. ”సత్యభామ” సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. 35 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ 90శాతం పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసింది కాజల్ అగర్వాల్. ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారు. కాజల్ గతంలో ఎప్పుడూ కనిపించని యాక్షన్ మోడ్లో ”సత్యభామ”లో కనిపించబోతోంది. కాజల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో శ్రమించి ఈ యాక్షన్ సీక్వెన్సులు కంప్లీట్ చేసింది. సినిమాలో ఈ పోరాట ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని టీమ్ నమ్ముతోంది. ”సత్యభామ” బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.