ఎస్‌కెఎన్‌కు పితృవియోగం

Jan 5,2024 08:59 #movie

టాలీవుడ్‌కు చెందిన నిర్మాత ఎస్‌కెఎన్‌ తండ్రి గాదె సూర్యప్రకాశరావు గురువారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలువురు సినీ ప్రముఖు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఫిలింనగర్‌కు సమీపంలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. చిరంజీవి అభిమానిగా ఇండిస్టీకి వచ్చిన ఎస్‌కెఎన్‌ మొదటి డిస్ట్రిబ్యూటర్‌గానూ, ఆ తర్వాత పిఆర్‌ఒగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సాయి రాజేష్‌తో కలిసి ఆయన తీసిన బేబీ హిట్‌ సినిమాగా నిలిచింది.

➡️