ప్రమోషన్స్‌లో ‘స్పిరిట్‌’

Jul 2,2024 21:24 #New Movies Updates

8త్‌ వండర్‌ సినిమా బ్యానర్‌పై చెన్నెబోయిన చిన వెంకటస్వామి సమర్పణలో నిర్మితమైన ‘స్పిరిట్‌ (ఈజ్‌ నాట్‌ వన్‌)’ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్రబృందం చేస్తోంది. థియేట్రికల్‌ ట్రైల్స్‌, సామాజిక మాధ్యమాలు, పోస్టర్లు ద్వారా ప్రచార కార్యక్రమాలను వేగంవంతం చేసింది. రవిబాబు, సత్యప్రకాష్‌, చిత్రం శ్రీను, రమ్య, ప్రియ, పింకీ, జూనియర్‌ రాజశేఖర్‌, ప్రేమకథా చిత్రం సైదులు, జబర్దస్త్‌ నాగ్‌తేజ్‌, చిట్టిబాబు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ, దర్శకత్వం సిహెచ్‌. వెంకట రవీంద్రనాథ్‌. ఎంఎస్‌., సంగీతం సంతోష్‌ కావాలి, సినిమాటోగ్రఫీ పి.భరత్‌రాజ్‌కమల్‌, ఎడిటర్‌ కెవివై పాపారావు.

➡️