రేపు శ్రీ విష్ణు కొత్త చిత్రం టైటిల్ అనౌన్స్‌మెంట్

Feb 28,2024 16:24 #New Movies Updates, #sree vishnu

హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి ఫస్ట్ కొలాబరేషన్ లో ‘రాజ రాజ చోర’చిత్రంతో నవ్వుల వర్షం కురిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించబోయే కొత్త చిత్రం కోసం మళ్లీ కలిశారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. బ్యానర్ ప్రొడక్షన్ నెం 32 అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ఫన్ జనరేట్ చేస్తోంది. ఈ సినిమా టైటిల్‌ని రేపు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నారు. దానికి నామకరణం ఈవెంట్ అని పేరు పెట్టారు. ఇది అచ్చతెలుగు సినిమా అని చెప్పడమే దీని ఉద్దేశం. ‘Wait up! You will be satisfied,” అని పోస్టర్ పై రాసుంది. పోస్టర్ సూచించినట్లుగా ఈ కొత్త చిత్రం బిగ్గర్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. సూపర్ హిట్ రాజ రాజ చోరాతో ఆకట్టుకున్న హసిత్ గోలీ శ్రీవిష్ణును హిలేరియస్ పాత్రలో ప్రజెంట్ చేయడానికి మరొక వినోదాత్మక, విన్నింగ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. మరోవైపు, శ్రీవిష్ణు తన గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్‌బస్టర్‌గా సక్సెస్ తో టాప్ ఫామ్‌లో వున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు అనౌన్స్ చేయనున్నారు.

➡️