ఆగస్టు 15న ‘తంగలాన్‌’

Jul 1,2024 18:51 #New Movies Updates, #thangalaan

విక్రమ్‌ నటిస్తున్న ‘తంగలాన్‌’ చిత్ర విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. పా రంజిత్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, జియో స్టూడియోస్‌ బ్యానర్స్‌పై ప్రొడ్యూసర్‌ కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా స్వాతంత్య్రానికి పూర్వం నేపథ్యానికి వ్యతిరేకంగా, తంగలన్‌ కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నివాసుల కథగా రూపొందుతోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, పశుపతి, పార్వతి, డేనియల్‌ కాల్టిగరోన్‌, హరికృష్ణన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఆ తరువాత ఏప్రిల్‌లో రిలీజ్‌ కానున్నట్లు తెలిపారు. అది కూడా పోస్టుపోన్‌ అయ్యింది. ఇప్పుడు మళ్లీ కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. కొత్త తేదీని ఆగస్టు 15గా నిర్ణయించారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్‌ కాబోతుంది.

➡️