18న తేజ సజ్జా సినిమా టైటిల్‌ ప్రకటన

Apr 15,2024 18:07 #New Movies Updates, #tejasajja

హను-మాన్‌ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, సూపర్‌ హీరో తేజ సజ్జా ప్రతిభావంతులైన యంగ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టంనేనితో కలిసి వస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌ నంబర్‌ 36గా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఒక గ్రాండ్‌ స్కేల్‌ పాన్‌ ఇండియా మూవీ ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
ఈ రోజు విడుదల చేసిన పోస్టర్‌ లో సూపర్‌ హీరో తేజ సజ్జ తన ముఖంలో ఇంటెన్సిటీ తో బ్యాక్‌ పోజ్‌ లోహుందా గా ఉన్నాడు. హనుమాన్‌ చిత్రం లో సాంప్రదాయ దుస్తులలో కనిపించిన తేజ ,ఇక్కడ మాత్రం స్టైలిష్‌ మేక్‌ ఓవర్‌ తో సూపర్‌ యోధాగా అద్భుతంగా కనిపించాడు. పోస్టర్‌లో తన దుస్తులు మంటల్లో అంటుకోవడం గమనించవచ్చు .ఈ సినిమా టైటిల్‌ ని మేకర్స్‌ ఏప్రిల్‌ 18న ప్రకటించనున్నారు. ఈగిల్‌ తర్వాత కార్తీక్‌ ఘట్టంనేని మరియు పి ఎం ఎఫ్‌ కు ఇది వరుసగా రెండవ ప్రాజెక్ట్‌. అద్భుతమైన టెక్నీషియన్‌ అయిన కార్తీక్‌ ఘట్టంనేని,తేజ సజ్జను భారీ క్యారెక్టర్లో ప్రెజెంట్‌ చేస్తూ లార్జర్‌ దాన్‌ లైఫ్‌ స్టోరీని రాశాడు. ఇది సూపర్‌ యోధా యొక్క సాహసోపేతమైన కథ.

➡️