జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే : సమంత

Jan 18,2024 16:45 #movie, #samantha

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటి సమంత, హీరో నాగచైతన్య 2021 అక్టోబర్‌లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం సమంత నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో ఆమె ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె తన వైవాహిక జీవితం గురించి కామెంట్స్‌ చేసింది. సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆమె వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. జీవితంలో తాను చేసిన తప్పేంటో కూడా చెప్పారు. ‘నా ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యాను. దానిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎందుకంటే గతంలో నా భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడు. క్లిష్ట సమయం నుంచే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది.’ అని సమంత చెప్పుకొచ్చింది.

➡️