ఎన్టీఆర్‌ ‘దేవర’ షుటింగ్‌ టీమ్‌పై తేనెటీగలు దాడి

May 7,2024 10:32 #devara movie, #NTR
devara agamanam updates
  • 20 మందికి గాయాలు

హైదరాబాద్‌ : జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తారక్‌ హీరోగా పాన్‌ ఇండియా లెవల్‌ల్లో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా దేవర మూవీ షుటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూవీ షుటింగ్‌ స్పాట్‌లో ఉన్న ఒక తేన తెట్ట కదలడంతో, అక్కడ ఉన్న జూనియర్‌ ఆర్టిస్టులపై అవి దాడి చేశాయి. దీంతో వారు పరుగులు పెడుతున్న క్రమంలో వారికి తీవ్రంగా గాయాలు అయ్యాయంట. వెంటనే వారిని దగ్గరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 20 మంది ఈ తేనెటీగల దాడిలో గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఏపీలోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద షుటింగ్‌ జరుగుతుండగా దాడి జరిగినట్లు సమాచారం.

➡️