Vishwaksen అవయవదానం

Jun 17,2024 18:51 #movies, #Organ donation, #viswaksen

హీరో విశ్వక్‌సేన్‌ తన అవయవ దానం ప్రకటించి, ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అవయవ దానానికి మద్దతిస్తూ, దానిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘మెట్రో రెట్రో నోబుల్‌ కాజ్‌ ఈవెంట్‌’కు అతిథిగా వెళ్లిన విశ్వక్‌, ఆ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో, ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ విశ్వక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతిఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాలనీ, తద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడాలని విశ్వక్‌ కోరారు. దర్శకుడు శైలేష్‌ కొలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️