మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు షూటింగ్లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని టాకీ పార్ట్స్, పాట, యాక్షన్ బ్లాక్ని చిత్రీకరించారు.చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం బృందంతో పాటు త్రిష కృష్ణన్ కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు! #విశ్వంభర ” అని ఆమె పోస్ట్ చేశారు. చిరంజీవి, త్రిష, వశిష్ట, కీరవాణి, విక్రమ్, వంశీ, ఛోటా కె నాయుడు, ఎఎస్ ప్రకాష్ కనిపిస్తున్న మరో పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/mega-srar.jpg)