యాత్ర 2 టీజర్‌ : నేను వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కొడుకుని

Jan 5,2024 13:47 #movie, #yatra 2 movie

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సిపి పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లైఫ్‌స్టోరీ కథాంశంతో యాత్ర 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్‌ని చిత్రయూనిట్‌ విడుదలైంది. ఈ సినిమాలో వైఎస్‌ జగన్‌ పాత్రలో నటుడు జీవా నటించారు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించారు. యాత్ర సినిమాలో రాజశేఖరరెడ్డి ఏపీ సిఎం ఎలా అయ్యాడో చూపిస్తే.. యాత్ర 2లో జగన్మోహన్‌రెడ్డి ఎలా అయ్యాడు? ముఖ్యమంత్రి అయ్యేముందు జగన్‌కి ఎదురైన సవాళ్లను ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన విడుదల కానుంది.

➡️