ఎలక్టోరల్‌ బాండ్లు – మీడియా స్వతంత్రతపై రాజీ

Mar 27,2024 04:20 #editpage

సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎలక్షన్‌ కమిషన్‌కు సమర్పించిన వివరాలను చూసి దేశం విస్తుపోయింది. కార్పోరేట్‌ దిగ్గజాలు క్విడ్‌ ప్రో కో (నీకు ఇంత నాకు అంత) పద్ధతిలో రాజకీయ పార్టీలకు వేల కోట్ల రూపాయలు విరాళాలిచ్చిన వైనం అలా వుంది మరి!
దేశంలోని అతి పెద్ద ప్రభావవంతమైన న్యూస్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌లు, వార్తా పత్రికలు, మ్యాగజైన్‌, పోర్టల్‌, ఓ.టి.టి యజమానులు రాజకీయ పార్టీలకు భారీ మొత్తంలో విరాళాలు అందజేసే వారిలో ఒకరిగా మారారు. పాక్షికంగానైనా రాజకీయ నిధుల వివరాలు బహిర్గతం కావడంతో బడా వ్యాపారులతో వీరికున్న సంబంధాలు ప్రస్ఫుటమయ్యాయి. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభమని చెప్పుకునే మీడియా సమర్థతపై, స్వతంత్రతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముంబైకి చెందిన క్విక్‌ సప్లై చైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ‘జాబ్‌ కార్ట్‌’లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం డైరెక్టర్లుగా ఉన్న విపుల్‌ ప్రాణ్‌లాల్‌ మెహతా, తపస్‌ మిత్రాలకు ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌తో బలమైన సంబంధాలున్నాయి. తపస్‌ మిత్ర రిలయన్స్‌ ఆయిల్‌, పెట్రోలియం, రిలయన్స్‌ ఫైర్‌ బ్రిగేడ్స్‌, రాల్‌ ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫిలయన్స్‌ ఫస్ట్‌, రిలయన్స్‌ పాలిస్టర్స్‌లో డైరక్టర్‌గా కూడా ఉన్నారు.
వ్యక్తులుగా బాండ్‌లు కొనుగోలు చేసిన వారిలో లకీë మిట్టల్‌ అగ్రస్థానంలో వుండగా లకీëదాస్‌ వల్లభదాస్‌ రెండవ స్థానంలో ఉన్నారు. వీరు 25 కోట్ల వ్యక్తిగత బాండ్లను కొనుగోలు చేశారు. ‘బిజినెస్‌ లైన్‌’ ప్రకారం…384 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేసిన 374 మందిలో లకీë మిట్టల్‌ ముఖ్యమైన వారు.
రిలయన్స్‌ కంపెనీ స్వాధీనం చేసుకున్న నెట్‌వర్క్‌ 18 మీడియా గ్రూపులో 6 కంపెనీలకు లకీëదాస్‌ డైరెక్టర్‌గా ఉన్నట్లు ”రిపోర్టర్స్‌ కలెక్టివ్‌” సంస్థ గుర్తించింది. 1 కోటి రూపాయల విలువైన 25 బాండ్లను 2023 నవంబరు 17న వ్యక్తిగత దాత హోదాలో కొనుగోలు చేశారు.
రిలయన్స్‌ గ్రూపులో కొద్దిపాటి వాటా కలిగిన మీడియా మాట్రిక్స్‌ వరల్డ్‌వైడ్‌ అనే సంస్థ (ఎం.ఎన్‌ మీడియా వెంచర్స్‌) నవంబరు 2022లో 5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. నెక్స్‌జీ డివైజెస్‌ బోర్డు సభ్యులలో ఒకరైన సురేంద్ర లునియా ఎన్‌డిటివిలో 29.18 శాతం వాటాను అదానీ గ్రూపుకు గత సంవత్సరం విక్రయించాడు.
ఇన్ఫోÛటల్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌, ఇన్ఫోÛటల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, మేన్‌కైండ్‌ ఫార్మాలలో కూడా సురేంద్ర లునియా బోర్డు సభ్యునిగా వున్నారు. నెక్స్‌జీతో కలసి ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.79 కోట్ల విరాళాలను వారు రాజకీయ పార్టీలకు ఇచ్చారు.
సన్‌ టీవీ నెట్‌వర్క్‌ నుండి 10 కోట్ల విలువైన బాండ్లను 2021 ఏప్రిల్‌ 6, 2022 జనవరి 11 మధ్యలో స్వీకరించినట్లు డి.ఎం.కె పార్టీ 2024 మార్చి 17న ఎన్నికల సంఘానికి తెలిపింది.
తమిళనాడుకు చెందిన సన్‌ టీవీని కళానిధి మారన్‌ 1993లో స్థాపించారు. ఈ మెగా మీడియా నిర్వహిస్తున్న కాల్‌ రేడియో లిమిటెడ్‌, సౌత్‌ ఏషియా ఎఫ్‌.ఎమ్‌ లిమిటెడ్‌ 2021 ఏప్రిల్‌ 3న రెండు విడతలుగా రూ.7 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి.
సన్‌ టీవికి 6 భాషల్లో 35 టీవీ ఛానళ్లు ఉన్నాయి. 27 దేశాలలో 140 కోట్ల భారతీయ కుటుంబాలకు ఈ ఛానళ్ల ప్రసారాలు వెళతాయి. 69 ఎఫ్‌.ఎమ్‌ రేడియో స్టేషన్లు, 3 దిన పత్రికలు, 6 మ్యాగజైన్లు ఉన్నాయి.
భారతదేశంలో అతి పెద్ద డిటిహెచ్‌ ప్రొవైడర్లలో ఇది ఒకటి. సన్‌ పిక్చర్స్‌ అనే ఫిల్మ్‌ డివిజన్‌ ఉంది. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును, దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్‌ కేప్‌ జట్టులను ఈ గ్రూప్‌ సొంతం చేసుకుంది.
ఎలక్టోరల్‌ బాండ్ల దాతలలో మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ రెండవ స్థానంలో ఉంది. అంతేకాక అతి పెద్ద టెలివిజన్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌లలో ఒకటైన టివి9 భారత్‌వర్ష్‌ వీరిదే. తెలుగుతో బాటు 7 భాషల్లో 15 రాష్ట్రాల్లో న్యూస్‌ నెట్‌వర్క్‌ సామ్రాజ్యాన్ని విస్తరించింది. హైదరబాద్‌లో ఉన్న అసోసియేటెడ్‌ బ్రాడ్‌ కాస్ట్‌ నెట్‌వర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యంలో ఇది నడుస్తోంది.
ప్రభుత్వ అనుకూల వార్తలను ప్రసారం చేయటంలో ఈ ఛానెల్‌ పెట్టింది పేరు. ఎలక్షన్‌ కమిషన్‌ వివరాల ప్రకారం రూ. 966 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లను మేఘా ఇంజనీరింగ్‌ 2019 ఏప్రిల్‌, 2024 జనవరి మధ్యలో కొనుగోలు చేసింది. 2018ా2019 మధ్య కాలంలో వెలుగులోకి రాని వాటిని కూడా కలుపుకుంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
కార్పోరేట్‌ కంపెనీల యాజమాన్యాల కింద ఉంటే మీడియా వ్యాపార ప్రయోజనాల కోసం, ప్రాజెక్టుల్లో కాంట్రాక్టుల కోసం లాబీయింగ్‌ చేస్తాయి.
కేంద్రరాష్ట్ర్ర ప్రభుత్వాల మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను ఈ కంపెనీ చేజిక్కించుకున్న విషయం తెలిసినదే.
టీవీ9 భారత్‌వర్ష్‌లో జరిగిన ఒక టీవీ చర్చల్లో సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి సునీల్‌ సజన్‌ మాట్లాడుతూ పెద్ద జర్నలిస్టులని చెప్పుకుంటున్న ఎవరూ ఎలక్టోరల్‌ బాండ్ల గురించి గానీ….వాటి కొనుగోలులో కేంద్ర ఎజన్సీలు ఎలాంటి ప్రభావం చూపాయనేదిగానీ కనీసం చర్చించలేదన్నారు. ”మోడీ గెలుస్తారుాకానీ ఎలా గెలుస్తారో” ఈ బాండ్ల బండారాన్ని బట్టి అర్ధమవుతోందన్నారు. టీవీ యాంకర్‌గా ఉన్న గౌరవ్‌ అగర్వాల్‌ రాబోయే ఎన్నికలో మోడీ ఎలా గెలుస్తారో చెప్పాలని ప్యానలిస్ట్‌లను అడగటంతో చర్చ పక్కకు పోయింది. దీన్నిబట్టి ఈ న్యూస్‌ ఛానళ్లు ఏ చర్చలను ఎవరికి అనుకూలంగా మరలుస్తాయో అర్ధమవుతుంది.
పారిశ్రామికవేత్త సంజీవ్‌ గోయెంకా పెద్ద ఎత్తున ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేశారు. ఆయనను అనుసరించే మీడియా గ్రూపులు అనేకం ఉన్నాయి. గోయంకా గ్రూపు 609 కోట్ల రూపాయల ఎలక్టోరల్‌ బాండ్లు, ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ద్వారా మరో 100 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఎలక్షన్‌ కమిషన్‌ వివరాల ప్రకారం హల్డియా ఎనర్జీ లిమిటెడ్‌, ధరైవాల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌, ఫిలిప్‌ కార్బన్‌ బ్లాక్‌ లిమిటెడ్‌, పిసిబిఎల్‌ గా పిలవబడే క్రిసెంట్‌ పవర్‌ లిమిటెడ్‌, ఆర్‌పిఎస్‌జీ వెంచర్లు మొత్తం 5 కంపెనీల నుండి ఈ బాండ్లను కొన్నాయి.
పైన ప్రస్తావించుకున్న వార్తా సంస్థలు గత కొన్నేళ్ళుగా బి.జె.పి అనూకూల వైఖరిని బహిరంగంగానే అనుసరిస్తున్నాయి. మోడీ, ప్రభుత్వ విధానాలను విమర్శించే ఏ జర్నలిస్టునూ తమ సంస్థల్లో వుంచుకోవడానికి కార్పోరేట్‌ మీడియా సిద్ధంగా లేదు. తమకు ఎంత లాభం, తాము ఎంత ఇస్తాము అన్న క్విడ్‌ ప్రో కో విధానాలే నడుస్తున్నాయి.
ప్రముఖ హలీవుడ్‌ రిపోర్టర్‌ ప్రారంభించబోయే లైఫ్‌స్టైల్‌ మ్యాగజైన్‌ ”ఎస్క్వైర్‌”లో కూడా గోయెంకా గ్రూపుకు వాటాలు వున్నాయంటే వీరి సంబంధాలు ఏ స్థాయిలో వున్నాయో అర్థం చేసుకోవచ్చు.
గోవాకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ టెంపో ఇండిస్టీస్‌, దాని అనుబంధ సంస్థలతో కలిసి రూ. 1.5 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్ల కోసం ఖర్చు చేసింది. ఈ కంపెనీ మైనింగ్‌, నౌకా నిర్మాణం, ఫుడ్‌ ప్రోసెసింగ్‌లలో భారీ పెట్టుబడులున్నాయి. ఆసక్తికర అంశం ఏమిటంటే గోవా లోని ప్రముఖ దిన పత్రిక నవ్వింద్‌ టైమ్స్‌, మరాఠీ దిన పత్రిక నవప్రభ వీరివే.
బడా కార్పొరేట్ల గుత్తాధిపత్యం దిశగా భారతదేశ మీడియా చేరుకుంది. వీరు తమ వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వాల నుండి లాభాలు పొంది తిరిగి ఆ లాభాలలో వాటాలను ఆ యా పార్టీలకు బాండ్ల రూపంలో చేర్చాయి. ఈ పరిస్థితులలో… ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా వుండాల్సిన మీడియా… ప్రజల పక్షాన నిలబడగలదా అన్నది ప్రశ్న.
/ ‘ది వైర్‌’ నుంచి /

➡️