చాక్లెట్ల వల్ల లాభాలూ నష్టాలూ …

Jun 17,2024 04:05 #Jeevana Stories

పిల్లలు స్కూలుకు బయల్దేరుతున్నారు కదా! ఇప్పుడే తల్లిదండ్రులకు పెద్ద సమస్య తయారవుతుంది. ‘పేచీ పెట్టకుండా స్కూలుకు వెళితే నీకు సాయంత్రం చాక్లెట్‌ కొనిపెడతా’ అని చాలామంది తల్లిదండ్రులు, మారం చేసే పిల్లలను స్కూలుకు పంపించేందుకు తాయిలాలు ప్రకటిస్తారు. ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లలకు చాక్లెట్లు, ఐస్‌ క్రీంలు అంటే చాలా ఇష్టం. అయితే ఐస్‌ క్రీం వల్ల జలుబు చేస్తుందని చాక్లెట్లు ఇవ్వడానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. పైగా చాక్లెట్లు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, ముఖం కాంతివంతంగా తయారవుతుందని నమ్మే పెద్దలూ ఉన్నారు. అయితే చాలామంది తల్లిదండ్రులకు చాక్లెట్లు పిల్లల ఆరోగ్యానికి మంచివా కాదా అనేది మాత్రం తెలియదు.
చాక్లెట్లు తినడం వల్ల కలిగే లాభాలు
ా నీరసంగా ఉన్నప్పుడు చాక్లెట్లు తినడం వల్ల కాస్త ఎనర్జీ వస్తుంది. అలాగే చాక్లెట్లలో కొన్ని విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా డార్క్‌ చాక్లెట్లు జ్ఞాపకశక్తిని పెచండంతో పాటు ముఖం కాంతివంతంగా మారేందుకు సహాయపడుతుంది.
ా చాక్లెట్ల ఉత్పత్తికి వాడే కోకోపౌడర్‌లో కొన్ని ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించడం, యాంటీ ఆక్సిడెంట్లను పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్సులిన్‌ సెన్సివిటీని పెంచి మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
ా డార్క్‌ చాక్లెట్లలో సెలీనియం, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌ ఇంకా అనేక ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
చాక్లెట్ల వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌
ా చాక్లెట్లులో ఉండే కెఫిన్‌ పదార్థం చిన్న పిల్లలో నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. ఎక్కువగా చాక్లెట్లు తింటే రాత్రంతా పిల్లలు పడుకోరు.
ా చాక్లెట్లను ఎక్కువ మోతాదులో ఇస్తే మాత్రం పిల్లల ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుంది. పిల్లల్లో అలెర్జీ ఉంటే చాక్లెట్లను ఇవ్వకపోవడమే మంచిది. చాక్లెట్లలో పాలు, గింజలు, ఇతర పదార్థాలు కూడా కలుపుతుంటారు. ఇలాంటి వాటి వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ా చాక్లెట్లలో ఉండే కెఫిన్‌ తరచుగా పిల్లలు టాయిలెట్‌కు వెళ్లేలా చేస్తుంది. ఎక్కువగా తింటే తరచుగా వాళ్లు ప్యాంటు తడిపేసే ఛాన్స్‌ ఉంది.
ా ఇందులో ఉండే కోకో బటర్‌, ఇతర పదార్థాలు ఊబకాయం పెరిగే లక్షణాలను కలిగిఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకునే పిల్లలు త్వరగా ఊబకాయానికి గురవుతారు.

➡️