పుస్తకాలు

Jul 2,2024 04:33 #feachers, #jeevana, #Kavitha

పుస్తకాలు హస్త భూషణాలు
పుస్తక పఠనం ఉత్తమాభిరుచికి నిదర్శనం
మస్తిష్కానికి ఆహారాలు
మానవతను మేల్కొల్పే కారకాలు
ఆపదల్లో ఉపాయ సూచికలు
ఏకాంతంలో ప్రియనేస్తాలు
యువత భవితకు మార్గదర్శకాలు
విజ్ఞాన వినోద ప్రసాదితాలు
నైతిక విలువల ప్రజ్వలితలు
మాతృభాషా వికాసకాలు
సంస్కృతీ సంప్రదాయాల పరి వ్యాప్తికలు
దురాచారాల నిర్ములనా అస్త్రాలు
అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞాన కిరణాలు
సామాజిక చైతన్య కరదీపికలు
ఇతిహాసపు గాథల నిక్షిప్త గనులు!

– ఆళ్ల నాగేశ్వరరావు,
74166 38823.

➡️