లిచీతో ఆరోగ్యం

Jun 17,2024 04:35 #jeevana

ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా లిచీ పండ్లు కనిపిస్తున్నాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్న ఈ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి బయటపడేందుకు సహాయపడతాయి.
– రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చర్మ రక్షణకు దోహదపడతాయి. ఈ పండ్లతో జ్యూస్‌లు, జెల్లీలు, శీతల పానీయాలను కూడా తయారు చేసుకోవచ్చు.
– లిచీ పండ్లలో విటమిన్‌ సి, విటమిన్‌ డి, మెగ్నిషియం, రైబో ఫ్లేవిన్‌, కాపర్‌ వంటి పోషకాలు ఉంటాయి.
– వీటిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలని అనుకొనేవారికి ఇవి చాలా మంచివి.
– ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
– చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
– వృద్ధాప్య చాయలు రాకుండా అడ్డుకుంటుంది..
– పోటాషియం అధికంగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.

➡️