మొక్కజొన్నతో మెండైన ఆరోగ్యం

Jul 3,2024 05:20 #feachers, #health corn, #jeevana

వానలు పడుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంటోంది. ఇటువంటప్పుడే వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. అయితే బయట ఫుడ్‌ కన్నా ఇంట్లో చేసుకునే ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా నూనెతో చేసిన పదార్థాల కన్నా మొక్కజొన్న లాంటివి ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. పైగా ఈ సమయంలో మొక్కజొన్న విరివిగా, చౌకగా లభించే ఆహారం.

  •  మొక్కజొన్న చాలా బలవర్ధక ఆహార పదార్ధం. ఇందులో లినోలిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ ఇ, బి1, బి6, నియాసిన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌, రైబోఫ్లోవిన్‌ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉంటే మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ అరికడుతుంది.
  •  ఎముకల బలానికి అవసరమైన లవణాలు, మినరల్స్‌ మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మినరల్స్‌ అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌ వంటివి కూడా వీటిలో ఉండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
  •  మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. మొక్కజొన్న గింజల నూనెను చర్మానికి రాస్తే దీనిలో ఉండే లినోలె యాసిడ్‌ చర్మ మంటలను, ర్యాష్‌లను తగ్గిస్తుంది.
  •  మొక్కజొన్నలో ఫోలిక్‌ యాసిడ్‌ ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. జుట్టు మొదళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి పవర్‌పుల్‌ యాంటీ ఆక్సిడెంట్‌ లైకోపిన్‌ వల్ల జట్టు మెత్తగా, మృదువుగా మారుతుంది.
➡️