పట్టు చీరల ఇస్త్రీ ఇలా

Dec 26,2023 10:05 #feature

బట్టలు ఇస్త్రీ చేసుకునేటప్పుడు, అన్ని బట్టలు ఒక ఎత్తు అయితే.. పట్టు చీరలు మరో ఎత్తులా చేసుకోవాలి. పట్టు చీరలు ఎప్పటికీ కొత్తగా కనిపించాలంటే ఇస్త్రీ చాలా ముఖ్యం.ా చీరలు కొనేటప్పుడే వాటిని ఇస్త్రీ చేయవచ్చో లేదో తెలుసుకోవాలి. అలాగే ఇస్త్రీ చేసేటప్పుడు చీరపై కాటన్‌ వస్త్రం ఉంచి చేయాలి. ఇలా చేస్తే, వేడికి కాలిపోకుండా ఉంటాయి.ా ఐరన్‌ బాక్స్‌ మోడ్స్‌ని మార్చుకోకుండా ఇస్త్రీ చేయవద్దు. అలాగే ముందుగా చీర అంచులను ఇస్త్రీ చేయాలి. ఆ తర్వాతే చీర మధ్యలో చేయాలి. ఇలా చేస్తే ముడతలు చక్కగా పోతాయి. ా ఐరన్‌ చేయగానే వెంటనే మడతలు పెట్టకూడదు. హ్యాంగర్‌కు వేలాడదీయాలి. వెంటనే మడత పెడితే ముడతలు వచ్చేస్తాయి.

➡️