వేసవి విడిదిలో …

May 21,2024 05:03 #feachers, #jeevana, #Kavitha

వేసవి విడిది వచ్చింది
ఆహ్లాదాన్ని పంచింది
ఆటలు బాగా ఆడించింది
జాలీగా కాలం గడిపింది
చుట్టాలింటికి వెళ్ళాము
అందరితో కలిసున్నాము
మాటా మంతి కలిపాము
గతాన్ని నెమరు వేసాము
బొమ్మలు బాగా గీసాము
చిట్టి కథలను రాసాము
గేయాలెన్నో చదివాము
హాయిగా పొద్దు గడిపాము
పరిసరాలు చుట్టొచ్చాము
ప్రకృతిలో కలిసి పోయాము
పొలాలు గట్లు తిరిగాము
చెట్లతో చెలిమి చేసాము
అవ్వ తాతను కలిసాము
పొడుపు కథలు విప్పాము
సాధు జంతువుల్ని కలిసాము
హాయిగా ఆటాడుకున్నాము
కాళ్ళకు చక్రాలు కట్టాము
ఊరు మొత్తం తిరిగాము
చాలా అలసిపోయాము
బాగా తిని బజ్జున్నాము
తెలతెలవారగా లేచాము
దినపత్రికలు చదివాము
లోకజ్ఞానం తెలుసుకున్నాము
విజ్ఞానంతో మసలుకున్నాము
పగలంతా హాయిగా వున్నాము
అలసటనే మరచిపోయాము
ఆహ్లాదంగా కాలం గడిపాము
ఉరకలు వేస్తూ కదిలాము
తీర్థయాత్రలకు వెళ్ళాము
గుడి గోపురాలను చూసాము
నచ్చిన ప్రదేశాలకు పోయాము
ఎంతెంతో తెలుసుకున్నాము
వేసవి విడిది ఆహ్లాదం
స్వేచ్ఛకు అది ప్రతిరూపం
పిల్ల పాపల కేరింతలకు
వేసవి కాలం ఉత్సాహం!

– నరెద్దుల రాజారెడ్డి,
96660 16636.

➡️