బడులు తెరుచుకొన్న వేళ…

Jun 17,2024 04:46 #jeevana

రంగురంగుల యూనిఫామ్స్‌లో
సీతాకోక చిలుకల్లాంటి పిల్లల దర్శనాలు
రోడ్లపై స్కూలు బస్సుల రాకపోకలు
తెరుచుకున్న బడులకు సంకేతాలు

వేసవి సెలవుల అనంతరం మోగే బడిగంట
బడి పిల్లలకు కొత్తగా పలికే స్వాగతం
బడుల్లో పైతరగతిలో ప్రవేశం
పిల్లలకు ఉత్తీర్ణతతో దక్కే ఆనందం

కొత్త ఉపాధ్యాయులు, కొత్త స్నేహితులతో
బెరుకు బెరుకుగా మొదలయ్యే
పిల్లల తొలినాళ్ళ పరిచయాలు
అనతికాలంలో అయ్యే సత్సంబంధాలు

విద్యాలయాలు బాలలకు దేవాలయాలు
చదువుసంధ్యలు, ఆటపాటలు నేర్పే నిలయాలు
విజ్ఞానాన్ని బోధించే గురుకులాలు
పిల్లలను తీర్చిదిద్దే శిక్షణాలయాలు

-పి.వి.ప్రసాద్‌,
94401 76824

➡️