అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్షలు-లైవ్‌

Jan 17,2024 12:50 #Anganwadi strike

 

విజయవాడ : తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా … నేటి నుండి అంగన్వాడీలు నిరపధిక నిరాహార దీక్షలు చేపట్టారు. బుధవారం ఉదయం 11 గంటలకు విజయవాడ ధర్నా చౌక వద్ద అంగన్‌వాడీ సంఘాల నాయకత్వం దీక్షలను చేపట్టింది. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, అమరావతి ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు, సిఐటియు నరసింగరావు, ఎఐటియుసి ఓబులేష్‌, కాంగ్రెస్‌ సుంకర పద్మశ్రీ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. ఈ నిరాహార దీక్షలకు ముందు అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ దీక్షా శిబిరాన్ని ఎంఎల్‌సి కెఎస్‌ లక్ష్మణరావు ప్రారంభించారు.

➡️