బ్యాగీ గ్రీన్‌ కోసం వార్నర్‌ అభ్యర్థన

Jan 2,2024 10:33 #Cricket, #Sports, #warner
  • కావాలంటే బ్యాక్‌ప్యాక్‌ ఇస్తానని వెల్లడి

సిడ్నీ : ఫేర్‌వెల్‌ టెస్టుకు ముందు ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడి బ్యాగీ గ్రీన్‌ (క్యాప్‌) కనిపించకుండా పోయింది. దీంతో అది దొరికినవారు ఇచ్చేయాలంటూ ఇన్‌స్టా వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. అందులో వార్నర్‌ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం తన బ్యాగీ గ్రీన్‌ ఉన్న లగేజ్‌ మెల్‌బోర్న్‌ నుంచి సిడ్నీ వెళ్తున్న సమయంలో విమానాశ్రయంలో మాయమైందని.. విమానయాన సంస్థ క్వాంటాస్‌ను అడిగితే తమ కెమెరాలు చెక్‌ చేశామని, బ్యాక్‌ప్యాక్‌ ఓపెన్‌ చేసినట్టు ఎక్కడా కనిపించలేదని చెప్పారని పేర్కొన్నాడు. మీరు క్వాంటాస్‌ కోసం పనిచేస్తున్న వ్యక్తి అయినా, మరెవరైనా సరే బ్యాక్‌ప్యాక్‌ కావాలంటే తన వద్ద మరోటి ఉంది ఇస్తానని, కానీ ఆ బ్యాగీ గ్రీన్‌ కావాలని అభ్యర్థించాడు. తనను కానీ, క్రికెట్‌ ఆస్ట్రేలియాను కానీ సోషల్‌ మీడియా ద్వారా సంప్రదించి తన బ్యాగీ గ్రీన్‌ ఇస్తే తాను ఆ బ్యాక్‌ప్యాక్‌ ఇస్తానని చెప్పుకొచ్చాడు.

➡️