గన్నవరం ఎయిర్‌పోర్టులో..చంద్రబాబుకు ఘనస్వాగతం

Dec 1,2023 21:42 #Nara Chandrababu, #Vijayawada

ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా జిల్లా)తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు శుక్రవారం ఒంటి గంటకు చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, టిడిపి కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబును పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో అనుసరించారు. టిడిపి నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో జాతీయ రహదారి కిటకిటలాడింది. ఎయిర్‌పోర్టు నుంచి కేసరపల్లి, గూడవల్లి, నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల ప్రజలు దారిపొడవునా రోడ్లపైకి వచ్చి స్వాగతం పలికారు. యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో 200 మంది బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

➡️