Parliament session : 1946 తర్వాత మొదటిసారి స్పీకర్ పదవికి ఎన్నికలు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి.  స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.   1946 తర్వాత తొలిసారి స్పీపర్ పదవి కోసం ఎన్నికలు జరగనున్నాయి.   గతంలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన ఓం బిర్లానే తిరిగి స్పీకర్‌ పదవికి ఎన్‌డిఎ  నామినేట్‌ చేసింది.  స్పీకర్ పదవి కోసం ఓం బిర్లా నామినేషన్ సమర్పించారు.   అయితే  స్పీకర్ పదవి కోసం   ఇండియా బ్లాక్ కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది.   కేరళ మవిలేకర నియోజకవర్గ  ఎంపి కె. సురేష్  స్పీకర్ పదవి కోసం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.  ఆయన ఎనిమిది సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. గతంలో కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు.

బిర్లాకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే డిప్యూటీ స్పీకర్ పదవి  ఇండియా ఫోరమ్‌కి కేటాయించాలని ప్రతిపక్షాలు కోరాయి.  దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో  అభ్యర్థిని ప్రకటించింది.  దీంతో మూడు దశాబ్దాల తర్వాత రేపు మొదటి సారి స్పీపకర్ పదవి కోసం ఎన్నిక జరగనుంది.  ఎన్‌డిఎకి లోక్‌సభలో 293 మంది ఎంపిలు  ఉండగా,  ఇండియా బ్లాక్‌కు 233 మంది ఎంపిలు ఉన్నారు.

రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌, మహువా మొయిత్రా, సుప్రియా సూలే, కనిమొళిలు వంటి ముఖ్య నేతలు నేడు పార్లమెంట్‌లో ప్రమాణం చేయనున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక బుధవారం జరగనుంది.

➡️