TS ఇఎపిసెట్‌ -2024 ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : టీఎస్‌ ఇఎపిసెట్‌ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి కలిసి విడుదల చేశారు. టీఎస్‌ ఎప్‌సెట్‌ పరీక్షలు మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం వారికి, 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ వారికి పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలకు 91.24 శాతం మంది హాజరు కాగా, ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు 94.45 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

➡️