హైస్కూల్‌ విద్యార్థిని తేజోమయికి నాట్య రవళి అవార్డు

ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్య) : హైదరాబాదులోని శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళ నృత్య సంస్కృతి సంస్థ వారు మార్చి నెల 31వ తేదీన శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ లో నిర్వహించిన నృత్య ప్రదర్శనలో సిల్వర్‌ బెల్స్‌ ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌ విద్యార్థిని కొండగారి తేజోమయి అత్యుత్తమ నృత్య ప్రదర్శనను ప్రదర్శించిందని కరస్పాండెంట్‌ ఎంవి కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం కరస్పాండెంట్‌ మాట్లాడుతూ …. శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళ నృత్య సంస్కృతి సంస్థ వారు నాట్యరవలి అవార్డును, ప్రశంసాపత్రాన్ని తేజోమయికి అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా తేజోమయికి కరస్పాండెంట్‌ ఎంవి.కుమార్‌, ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, ప్రిన్సిపాల్‌ రాహుల్‌ లు కలిసి విద్యార్థిని అభినందించారు.

➡️