ప్రముఖ కవి వర్మ కలిదిండి ఆకస్మిక మృతి

Dec 25,2023 08:50 #death, #kavi, #Verma Kalidindi

ప్రజాశక్తి-అమరావతి : ప్రముఖ కవి వర్మ కలిదిండి గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి 11 గంటలకు బెంగుళూరులో మిత్రులతో కలిసి టీవీ చూస్తూండగా గుండె పోటుతో అక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని స్వగ్రామం చెరుకువాడకు తీసుకువస్తున్నారు. వర్మకు తల్లిదండ్రులు, భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌, ప్రధాన కార్యదర్శి కె.సత్యరంజన్‌.. వర్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆయన రాసిన పుస్తకాలు 

➡️