థూ..! థూ..!

Jan 14,2024 07:58 #Poetry, #Sneha
women harassment cartoon

ఆమె తలంపు

తీరాన్ని దాటి

శిఖరాన్ని చేరింది!

చేతిలో జెండా మురిసింది!

ఆమె తనువు

ఆమె కఠోర శ్రమ

కిచరమ గీతం పాడింది!

ఆమె మేనుపట్టిన కుస్తీలకు

గుల్ల కాలేదు

జీవశ్ఛవ సంఘ గొంతు పెగలక ముక్కలైంది!

ఆమె గొంతు

అరచి అరచి అరణ్యరోదనగా

రామ రాజ్యంలో మోడుబోయింది!

రాజధాని వీధుల్లో నిరసన

లాఠీల స్వైర విహారం

ఆమె పోరాటం

మనువుని మట్టు పెట్టలేక పోయింది!

ఆమె

ఎప్పుడూ లోకువే

పుట్టిన కాడి నుండి కాటికి పోయేదాకా

ఎండగట్టాల్సిన సమాజం

గాఢ నిద్ర నటింపు!

థూ! థూ!

ఊంచినా తుడుచుకు పోయే

ఆధిపత్య వర్గాల తెరవెనుక

తతంగాల తెర తీయగా

సమాధులు తవ్వాలి!

పూడ్చితే మళ్ళీ లేవకుండా!!

 

  • గిరి ప్రసాద్‌ చెలమల్లు, 9493388201
➡️