వెన్నెలమ్మా!

Dec 31,2023 09:42 #kavithalu, #Sneha

వెన్నెల్లో ఉంది చందమామ

అందంగా ఉంది జాబిలమ్మ

అందరూ ఇష్టపడేను నిన్నే చందమామ

అలిగితే అమ్మ నిన్నే చూపిస్తుందమ్మా

నల్లని దుప్పటి మీద తెల్లగా ఉన్నావమ్మా

నెలలో సగభాగం నీవేనమ్మా

ఎంత దూరంలో ఉన్నా అందరికీ కనిపిస్తావమ్మా

అల్లరిని తీర్చేది నీవే ఓ జాబిలమ్మా

నిన్ను తలచుకుంటే మనసంతా హాయేనమ్మా

నిన్ను ఎన్నో అందమైన పేర్లతో పిలుస్తారమ్మా

అన్నిటికీ నువ్వు సరితూగగలవమ్మా

అందుకే నువ్వంటే నాకు ఇష్టమమ్మా

అందమైన ఓ జాబిలమ్మా!

– కలిశెట్టి రమ్య9వ తరగతి,

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,రఘుమండ, విజయనగరం.

➡️