అబ్బురంగా పిల్లల ప్రదర్శనలు

Feb 25,2024 11:05 #chirumuvallu, #Sneha

అనంతపురం నగరంలోని ఆర్ట్సు కళాశాల మైదానంలో ఈనెల 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు ‘అనంత బాలోత్సవం-4 జరిగాయి. ఈ ఉత్సవాల్లో విద్యార్థులు అబ్బురపరిచే ప్రదర్శనలిచ్చారు. మొత్తం మూడు రోజుల్లో 150 పాఠశాలల నుంచి ఆరు వేల మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాస రచనలు, వక్తృత్వ, జానపద గేయాలాపనలు, భరత నాట్యం, నాట్య ప్రదర్శనలు, మట్టి బొమ్మలు తయారు చేయడం ఇలా అనేక రకాలైన పోటీలు, ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఆ మూడు రోజులు నగరంలో పిల్లల పండుగ వాతావరణం నెలకొంది. ఈ ప్రదర్శనలను తిలకించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు, నగరవాసులు పెద్దఎత్తున తరలివచ్చారు.

 

 

➡️