ప్లాస్టిక్‌ వాడొద్దు మిత్రమా…

Jun 23,2024 13:07 #Sneha

మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పచ్చనిచెట్లు నానాటికీ తగ్గిపోతుండటం ఆందోళన కల్గిస్తోంది. ప్రతిఒక్కరూ విచక్షణా రహితంగా అడవులు, చెట్లు నరికివేయటమే దీనికి ప్రధాన కారణం. అభివృద్ధి అవసరమే. కానీ ఆ పేరుతో అడవులను నిర్వీర్యం చేస్తే భవిష్యత్తులో ఉపద్రవాలు రావటం ఖాయం. అందుకే జీవజాతి మనుగడకు కారణమైన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. దానికి మన ఇంటి నుంచే ప్రయాణం మొదలవ్వాలి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటాలి. వాటిని కాపాడాలి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి. చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల్లో చెత్తాచెదారం వేయకుండా చూడాలి. దానికోసం వీలున్న చోట్ల మనవంతు కృషి కొనసాగాలి. భూమి, వాయు, జల కాలుష్యాలు తగ్గటానికి మనవంతుగా కృషిచేద్దాం. నావంతుగా నేను కృషిచేస్తా.. మరి మీరు కూడా చేస్తారుగా మిత్రులారా..!

-ప్రాతూరు అభినయి, 5వ తరగతి, గుడ్‌న్యూస్‌ ఇంగ్లీష్‌మీడియం స్కూల్‌, తాడేపల్లి, గుంటూరు

➡️