ముగింపు లేని మొదలు

Jun 16,2024 10:16 #Sneha

నేల రాలిన చినుకు
కాలం వేటలో
రాయి అయిన గుండెలాగా
నీటి చుక్క తన రూపాన్ని మార్చుకొని,
ఆకాశానికి ఏగింది
మౌన సంచారి,
వెన్నెలను చూస్తూ పెరుగుతోంది
మేఘముగా, నిశికి అందం అయ్యింది
ప్రపంచమంతా పయనించి,
అలిసిపోయాక తెలిసిందేమో
అలిసిపోయానని
మేఘం మైనంలా కరిగి,
వర్షంగా వాగుల్లో చేరి
పుడమి తల్లి కౌగిలిలో
తిరిగి కలిసిపోయింది
ఇదంతా, గుడి గంటల
పక్కనున్న స్తంభానికి తోడై
చేతిలో జడ భూ చక్రముగా
తిరుగుతున్నప్పుడు మెదలిన ఆలోచన
గంటల గణ గణ..
మదిలో మేఘ ఘర్షణగా మోగింది
కూతురైన తను
కోడలుగా రూపాన్ని మార్చుకొని
ఆకాశమైన మెట్టినింటికి
అందమే అయినా
కూతురిగా తలుపు తడితే
పుడమి తల్లిలా పుట్టింటి వారు
కౌగిలిలో చేరనిస్తారా?

ది చిన్మయి
10వ తరగతి
విజయవాడ
8374996653

➡️